
దశాబ్ధ కాలంగా టాప్ రేంజ్ లో ఉంటున్న కాజల్ లాస్ట్ ఇయర్ కాస్త ఫాం తగ్గినట్టు కనిపించినా మళ్లీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ఖైది నంబర్ 150తో సూపర్ హిట్ అందుకున్న కాజల్ రీసెంట్ గా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సత్తా చాటుకుంది. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ రెండు భాషల్లో కాజల్ కేక పెట్టించేస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్న కాజల్ ఇప్పుడు మరింత క్రేజ్ తెచ్చుకుంది.
తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న కాజల్ కోలీవుడ్ లో వివేకంలో అజిత్ పక్కన నటించడమే కాకుండా ఇళయదళపతి విజయ్ మెర్సల్ లో కూడా ఛాన్స్ పట్టేసింది. ఇక ఎలాగు డిమాండ్ పెరిగింది కాబట్టి అమ్మడు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట. నిన్న మొన్నటిదాకా కోటి కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకున్న కాజల్ ఇప్పుడు తనతో సినిమా అంటే 2 కోట్లు ఇస్తేనే అంటూ చెబుతుందట. ఎలాగు మిగతా హీరోయిన్స్ అంతా ఫేడవుట్ అయినట్టు కనిపిస్తుండగా ఉన్న ఏకైక బెస్ట్ ఆప్షన్ కాజల్ అని అంటున్నారు. మరి అమ్మడు ఈ అవకాశాలతో ఎలా రెచ్చిపోతుందో చూడాలి.