జై లవ కుశ ఆడియో గెస్ట్ అతనే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. జై టీజర్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన ఈ సినిమా నుండి రేపు సెకండ్ టీజర్ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ఆడియోని కూడా సెప్టెంబర్ 3న రిలీజ్ చేయబోతున్నారట. అసలైతే సెప్టెంబర్ 2 హరికృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని చూశారు. కాని ఆరోజు బిగ్ బాస్ షూటింగ్ ఉండటం వల్ల మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశారట.

ఇక ఈ ఆడియో వేడుకలకు బాహుబలి దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయట. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి ఆ సాన్నిహిత్యంతో ఆడియోకి వచ్చి సినిమాకు కావాల్సినంత క్రేజ్ తీసుకు రానున్నారు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.