
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఫిదా మూవీ ఇక సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. రిలీజ్ అయి నెల రోజులవుతున్నా ఫిదా రికార్డులను సొంతం చేసుకుంటూనే ఉంది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఫిదా మూవీలో మలయాళ ప్రేమం భామ సాయి పల్లవి భానుమతిగా నటించి మెప్పించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది.
హైదరాబాద్ లోని ఆర్టిసి క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ లో ఫిదా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన నాటి నుండి 30 రోజుల వరకు ఈ సినిమా ఆ సింగిల్ థియేటర్ లోనే 1 కోటి రూపాయల కలక్షన్స్ సాధించడం విశేషం. లార్జ్ సీటింగ్ కెపాసిటీ కలిగిన సుదర్శన్ థియేటర్ లో ఇలాంటి క్రేజీ రికార్డులు స్టార్ సినిమాలకు సొంతం అవుతుంటాయి. కాని ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఫిదా ఈ అరుదైన రికార్డ్ సొంతం చేసుకోవడం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. సినిమా ఇప్పటికి 80 శాతం వరకు ఆక్యుపెన్సీ సంపాదిస్తుండటం విశేషం.