
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రాబోతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సైరా నరసింహారెడ్డి అని టైటిల్ పెట్టారు. నిన్న రిలీజ్ అయిన టైటిల్ లోగోతో హంగామా షురూ చేశారు. ఇక ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ కూడా నటించడం విశేషం. ఆయనతో పాటు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి సై రా నరసింహారెడ్డిలో నటిస్తున్నారు.
అన్నిటికి మించి ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటం క్రేజీగా మారుతుంది. తెలుగు సినిమాలకు అరకొరగా మ్యూజిక్ అందించే రెహమాన్ ఇలాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో భాగమవడం మ్యూజిక్ లవర్స్ కు కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. ఇక చిరుతో రెహమాన్ 23 ఏళ్ల తర్వాత పనిచేస్తుండటం జరుగుతుంది. హిందిలో ద జెంటిల్మన్ రీమేక్ లో రెహమాన్ మ్యూజిక్ అందించాడు. శంకర్ జెంటిల్ మన్ రీమేక్ గా వచ్చిన ఆ సినిమా తర్వాత చిరు రెహమాన్ కలిసి పనిచేసే అవకాశం రాలేదు.