
అక్కినేని అఖిల్ హీరోగా చేస్తున్న రెండవ సినిమా హలో. విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కింగ్ నాగార్జున నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా టైటిల్ గా 'హలో' అని కన్ఫాం చేశారు. ఇక దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు.
సినిమా కోసం అఖిల్ స్పెషల్ ట్రైనెడ్ అయినట్టు తెలుస్తుంది. కళ్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఇంప్రెస్ చేసిన అఖిల్ సినిమాతో కూడా హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. అఖిల్ సినిమా తర్వాత రెండేళ్లు ఏరి కోరి ఎంచుకున్న ఈ హలో సినిమాతో అఖిల్ ఊహించిన రేంజ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.