స్పైడర్ ట్రైలర్ రిలీజ్ డేట్..!

ప్రిన్స్ మహేష్ హీరోగా మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తమిళంలో గ్రాండ్ ఈవెంట్ తో రిలీజ్ హంగామా స్టార్ట్ చేయనున్నారు. సెప్టెంబర్ 9న చెన్నైలో ఈ ఈవెంట్ జరుగబోతుందట. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినికాంత్ అటెండ్ అవుతారని తెలుస్తుంది.

ఇక ఇదే ఈవెంట్ లో స్పైడర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మహేష్ స్పై ఏజెంట్ గా కనిపిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు నిర్మిస్తున్నారు. 130 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. విలన్స్ గా ఎస్.జె సూర్య, భరత్ నటిస్తున్నారు. ఈ సంవత్సరం వస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్టులలో ఒకటైన ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.