పవర్ స్టార్ మేనియాతో సాయి ధరం తేజ్..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అతి తక్కువ టైంలో మెగా అభిమానుల మనసులు గెలుచుకున్న సుప్రీం హీరో సాయి ధరం తేజ్ ప్రస్తుతం బివిఎస్ రవి డైరక్షన్ లో జవాన్ సినిమా చేస్తున్నాడు. ఇక అదే కాకుండా కరుణాకరణ్ డైరక్షన్ లో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు తేజ్. ఇక ఈ సినిమా తొలిప్రేమను పోలి ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. తొలిప్రేమలో పవన్ క్యారక్టర్ కు కొనసాగింపుగా సినిమాలో హీరో తేజ్ పాత్ర ఉంటుందట.

కె.ఎస్ రవికుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తుందని చెబుతున్నారు. సినిమా కథ చాలా ఏళ్ల క్రితం రాసుకున్నా అంటున్న కరుణాకరణ్ సినిమా కచ్చితంగా తేజ్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుందని చెప్పుకొచ్చాడు. చిన్నదానా నీకోసం సినిమా తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న కరుణాకరణ్ ఈసారి పక్కా హిట్ కొట్టే కథతో వస్తున్నాడట. మరి కరుణాకరణ్ తో సాయి ధరం తేజ్ ఎలాంటి సినిమాతో వస్తున్నాడో చూడాలి.