
సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా రోబో సీక్వల్ గా శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా 2.0. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. ఇక సినిమా ముందు 2017 దీవాళికి రిలీజ్ అనుకున్నా అది మార్చి 2018 జనవరి 25న ఫిక్స్ చేశారు.
ఇక కొద్దిరోజులుగా విఎఫెక్స్ పనుల వల్ల 2.0 జనవరిలో కూడా వచ్చే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బాలీవుడ్ సిని క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ స్పందించారు. 2.0 రిలీజ్ పై ఎలాంటి డౌట్లు పెట్టుకోవద్దని. కచ్చితంగా అనుకున్న జనవరి 25కే రిలీజ్ అయ్యి తీరుతుందని అన్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం విశేషం.