
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరొయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే విలన్స్ గా నటిస్తుండగా మరో విలన్ గా జాకీ ష్రాఫ్ ను సెలెక్ట్ చేశారట.
బాహుబలితో నేషనల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే హిందిలో పరిచయం ఉన్న నటీనటులను వాడుతున్నారు. శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు ప్రభాస్.
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొన్నాడు. 6 నెలల్లో ఈ సినిమా రిలీజ్ అవనుందట. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.