
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాధ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పైసా వసూల్. ఖమ్మంలో ఆడియో రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సినిమా ట్రైలర్ లో పూరి మార్క్ కనిపిస్తుంది. ముఖ్యంగా డైలాగ్స్ నందమూరి ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
గొడవల్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాడికి టోర్నమెంట్లు పెట్టొద్దు అంటూ చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ అని చెప్పొచ్చు. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. శ్రీయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
శాతకర్ణి తర్వాత బాలయ్య పూరితో సినిమా అంటే అంచనాలు పెరిగాయి. పూరి సినిమాల్లో హీరో క్యారక్టరైజేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్యతో కూడా తన మార్క్ చూపించడానికి వస్తున్న పూరి పైసా వసూల్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.