ప్రేమం కాంబోలో సవ్యసాచి..!

నాగ చైతన్య హీరోగా మలయాళ ప్రేమం రీమేక్ డైరెక్ట్ చేసిన దర్శకుడు చందు మొండేటి మరోసారి చైతుతో చేస్తున్న సినిమా సవ్యసాచి. కుడి ఎడమలని తేడా లేకుండా రెండు చేతులతో సమానమైన పనులు గల వారిని సవ్యసాచి అంటారు. ఈరోజు టైటిల్ పోస్టర్ తో పాటు రెండు చేతుల్లో రెండు ఆయుధాలతో కనిపించాడు చైతు. ఫేస్ రివీల్ చేయలేదు కాని కచ్చితంగా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఈ ఇద్దరు మళ్లీ సినిమా చేస్తున్నారని చెప్పొచ్చు.

ప్రేమం తో సక్సెస్ అందుకున్న చైతు ఆ తర్వాత సాహసం శ్వాసగా సాగిపో పర్వాలేదు అనిపించుకున్నా రారండోయ్ వేడుక చూద్దాంతో మాత్రం మళ్లీ హిట్ అందుకున్నాడు. ఇక ఆ హిట్ మేనియా కంటిన్యూ చేసేందుకు సవ్యసాచిగా రాబోతున్నాడు చైతు. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ అయితే సినిమా మీద ఓ హైప్ క్రియేట్ చేశాయి. మరి అసలు సినిమా ఎలా ఉండబోతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.