
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం నటించే జై లవకుశ మీద భారీ అంచనాలే ఉన్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తుంది. ముఖ్యంగా యూఎస్ లో ఎన్.టి.ఆర్ సత్తా ఏంటో చూపిస్తుంది జై లవ కుశ. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యూఎస్ లో 8.5 కోట్లకు కొనేశారట. ఇదో రకంగా తారక్ కెరియర్ లోనే యూఎస్ లో హయ్యెస్ట్ బిజినెస్ మూవీ అని చెప్పొచ్చు.
ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీస్ రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా హుశారెత్తిస్తాయని అంటున్నారు. ఎన్.టి.ఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన జై టీజర్ చూసే సినిమా బిజినెస్ ఈ రేంజ్ లో జరుగుతుంది అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఎన్.టి.ఆర్ జై లవకుశ ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి.