
మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 151వ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే అక్కడక్కడ చిరు ఉయ్యాలవాడ సినిమా లుక్ మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది.
ఇక ఈ సినిమా టైటిల్ లోగో ఆగష్టు 22న చిరు బర్త్ డే నాడు రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే ఆ పోస్టర్ సిద్ధం చేశారని తెలుస్తుంది. టైటిల్ మహావీర అని పెడతారా లేక ఉయ్యాలవాడ నర సింహారెడ్డి అనే ఉంచుతారా అన్నది తెలియాల్సి ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హింది భాషల్లో తెరకెక్కబోతుంది.
అందుకే మూడు భాషల్లో ఆర్టిస్టులను ఎంపిక చేసే పనిలో ఉన్నారట చిత్రయూనిట్. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ అందించడం జరిగింది. మరి టైటిల్ లోగోతో చిరు సినిమా మీద ఏ రేంజ్ అంచనాలను పెంచేస్తారో చూడాలి.