
డిజె సక్సెస్ తర్వాత హరిశ్ శంకర్ ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యడు. దిల్ రాజు బ్యానర్లోనే ఈ సినిమా తెరకెక్కబోతుందట. వరుసగా దిల్ రాజు బ్యానర్లోనే హరిశ్ శంకర్ సినిమాలు చేయడం ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని తెలియచేస్తుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు యువ హీరోలు నటించే అవకాశాలున్నాయట. తెలుస్తున్న సమాచారం ప్రకారం నాని, శర్వానంద్ ఈ మల్టీస్టారర్ లో నటిస్తారట.
ఒకవేళ వాళ్లకి స్క్రిప్ట్ నచ్చకపోతే సాయి ధరం తేజ్, వరుణ్ సందేశ్ లతో ఈ సినిమా తీసే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు సినిమా టైటిల్ గా దాగుడు మూతలు అని రిజిస్టర్ చేయించాడట కూడా. మొత్తానికి దిల్ రాజుతో మరోసారి హరిశ శంకర్ పెద్ద ప్లానే వేశాడని చెప్పొచ్చు. నాని, శర్వానంద్ కాంబోనే సెట్ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట.
సినిమా టైటిల్ ప్రకారం చూస్తే ఇదో కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుందని అనిపిస్తుంది. ఈమధ్యనే ఫారిన్ లొకేషన్స్ చూసొచ్చిన హరిశ్ శంకర్ త్వరలోనే సినిమాకు ముహుర్తం పెట్టబోతున్నారట.