
సూపర్ స్టార్ మహేష్ వేగం పెంచేశాడు. ఒక సినిమా పూర్తయితే కాని సినిమా చేయని మహేష్ ఇప్పుడు తీస్తున్న సినిమా రిలీజ్ కాకుండానే ఒక సినిమా సెట్స్ మీద ఉంచాడు. ఇక అది షూటింగ్ జరుపుకుంటుండగానే మరో సినిమాకు ముహుర్తం పెట్టేశాడు. మహేష్ మురుగదాస్ ల కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవనుంది.
ఇక ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగానే భరత్ అను నేను సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు వంశీ పైడిపల్లితో మరో సినిమాకు ముహుర్తం పెట్టేశాడు. ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న వంశీ పైడిపల్లి మహేష్ కాంబినేషన్ లో మూవీ ఈరోజు ముహుర్త కార్యక్రమాలు జరుపుకుంది. రెగ్య్లర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవనుందట. మహేష్ సినిమాలు అవి కూడా రెండు భారీ ప్రాజెక్టులు ఒకేసారి సెట్స్ మీద ఉండటం అంటే మహేష్ వేగానికి మిగతా హీరోలంతా ముక్కున వేలేసుకోవాల్సిందే అంటున్నారు.