బిగ్ బాస్ లోకి ఎన్టీఆర్ విలన్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో వస్తున్న బిగ్ బాస్ షోలో ఇప్పటికే దీక్షా పంథ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మరో కంటెస్టంట్ ఆ హౌజ్ లోకి ఎంటరవబోతున్నాడని తెలుస్తుంది. ఈసారి ఓ మేల్ కంటెస్టంట్ ను బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించబోతున్నారట. అతనెవరో కాదు హీరో, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్టు నవదీప్ అని తెలుస్తుంది. 

ఎన్.టి.ఆర్ బాద్షా సినిమాలో తారక్ తో నటించిన నవదీప్ ఇప్పుడు ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షోలో కూడా మెరిసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే హౌజ్ లో ప్రిన్స్ లాంటి యంగ్ హీరో ఉండగా మరో యంగ్ హీరో నవదీప్ బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతున్నాడు. షోని ఎలాగైనా నిలబెట్టాలని చేస్తున్న స్టార్ మా ప్రయత్నాలు ఎంతవరకు నిలబడతాయో చూడాలి.