
కొత్తగా ఏ హీరోయిన్ అయినా ఇండస్ట్రీకి వస్తే చాలు ఇక్కడ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ అంటే ఇష్టమని చెప్పడం అలవాటే. ఇప్పుడు అదే దారిలో లై అంటూ నితిన్ పక్కన నటించిన చెన్నై భామ మేఘా ఆకాష్ కూడా పవర్ స్టార్ పై తన అభిమానాన్ని చూపిస్తుంది. అమ్మడు నటించింది పవర్ స్టార్ ఫ్యాన్ సినిమాలో కాబట్టి ఆ మాత్రం లెక్క ఉండాల్సిందే.
నితిన్ తను అభిమానించడమే కాదు పవర్ స్టార్ ను మేఘా కూడా ఇష్టపడేలా చేశాడట. ఇదే విషయాన్ని అమ్మడు చెప్పింది. తమిళంలో రెండు సినిమాలు చేసిన ఈ పిల్ల తెలుగు ఆడియెన్స్ ను బుట్టలో పడేసేందుకు పవర్ స్టార్ పేరు వాడుకుంటుంది. పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఆమెను నచ్చిన సినిమా అని అంటుంది. ఇక నిన్న రిలీజ్ అయిన లై టాక్ ఎలా ఉన్నా హీరోయిన్ గా మేఘా ఆకాష్ కు మంచి మార్కులే పడ్డాయి.