బిగ్ బాస్ లో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!

యంగ్ టైగర్ హోస్ట్ గా స్టార్ మాలో వస్తున్న బిగ్ బాస్ లో ఇప్పటికే దీక్షా పంథ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో హాట్ భామ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందట. దీక్ష పంథ్ అంత తెలిసిన ముఖం కాదు అందుకే కాస్త పాపులర్ భామను ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి పంపిస్తున్నారట. బిగ్ బాస్ మీద ఆడియెన్స్ క్రేజ్ తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాహకులు.

ఇక తారక్ తన హోస్టింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా మిగిలిన రోజులు మాత్రం అదో సోదిగా అనిపిస్తుంది. దీక్ష ఎంట్రీతో కాస్త హాట్ హాట్ గా మారిన బిగ్ బాస్ హౌజ్ ఇక కొత్త భామ ఎంట్రీతో మరింత క్రేజ్ తెచ్చుకుంటుందని అంటున్నారు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసుకోవాలంటే మరొకొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.