
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ మళ్లీ స్పీడ్ పెంచేశాడు. సుప్రీం తో హిట్ కొట్టి సుప్రీం హీరో అయిన సాయి ధరం తేజ్ ఆ తర్వాత వచ్చిన తిక్క, విన్నర్ సినిమాలతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా గెస్ట్ రోల్ చేసిన నక్షత్రం కూడా అంత మంచి టాక్ తెచ్చుకోలేదు. ఫలితాలు ఎలా ఉన్నా సరే ఈ మెగా హీరో స్పీడ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది.
వినాయక్ తో కొద్దిరోజులుగా కథా చర్చలు కొనసాగించిన తేజ్ సడెన్ గా ఈరోజు సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. సి.కళ్యాణ్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు ఆకుల శివ కథ అందిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడట. ఖైది నంబర్ 150 తర్వాత స్టాస్ తో సినిమా తీయాలని చూసిన వినాయక్ వారెవరి డేట్స్ అడ్జెస్ట్ కావని తెలుసుకుని సాయి ధరం తేజ్ తో ఫిక్స్ చేసుకున్నాడు.