
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమా తీసేందుకు ఆయన తనయుడు నట సింహం నందమూరి బాలకృష్ణ ఊపు చేశాడు. ఓపెన్ ఎనౌన్స్ మెంట్ చేసేసరికి ఆ ప్రాజెక్ట్ మీద అందరి కన్ను పడింది. ఇక సంచలన దర్శకుడు వర్మ అయితే ఇంకాస్త ముందడుగేసి బాలయ్య చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ చేస్తుంది తానే అని ప్రకటించుకున్నాడు.
ఈ విషయంపై బాలయ్య ఎలాంటి స్పందన తెలియచేయలేదు కాని ఇప్పుడు అసలు ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమానే ఆపేసే ఆలోచనలో ఉన్నాడట బాలకృష్ణ. 2019 ఎన్నికలు ఉండటంతో ఎన్.టి.ఆర్ బయోపిక్ అంటే కొన్ని నిజా నిజాలు బహిర్గతం చేయాల్సి వస్తుందని అందుకే ఆ రిస్క్ ఎందుకని వెనక్కి తగ్గాడట.
అట్టహాసంగా ఎనౌన్స్ చేసి బాలయ్య వెనక్కి తగ్గుతాడా అంటే దీని వెనుక అసలు సూత్రదారి ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడని అంటున్నారు. మరి వర్మతో ఎన్.టి.ఆర్ బయోపిక్ తీయరా లేక అసలు బయోపిక్ తీసే ఆలోచన లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.