
మ్యూజిక్ మిరకిల్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే సినిమాకు సగం సక్సెస్ వచ్చేసినట్టే. హుశారెత్తే మ్యూజిక్ తో సంగీత ప్రియులను ఉర్రూలగూలించే దేవి శ్రీ ప్రసాద్ తెలుగు తమిళ భాషల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించాడు. ఇక ఇంత టాలెంట్ ఉన్నా సరే దేవి శ్రీ ప్రసాద్ ఎందుకు బాలీవుడ్ వెళ్లలేదు అన్నది అందరి డౌట్ ఈ ప్రశ్ననే తన ముందు ఉంచితే బాలీవుడ్ లో ఒక సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తారు.
ఇక్కడ మాత్రం అలా కాదు.. ఇక తాను ఓ సినిమా కథ వినగానే దాన్ని ఓన్ చేసుకుని ఆ కథకు ఎలాంటి మ్యూజిక్ అయితే బాగుంటుందో ఆలోచించి కొడతా.. కాని ఒక పాట రెండు పాటలు అంటే కష్టం అందుకే బాలీవుడ్ నుండి రోజుకో ఆఫర్ వస్తున్నా సరే తాను చేయనని చెబుతున్నానని చెప్పాడు. దేవి మ్యూజిక్ బీ టౌన్ లో కూడా ఫేవరేట్.. ఎలాగా అంటే దేవి కొట్టిన ఆ అంటే అమలాపురం, రింగ రింగ సాంగ్ లు అక్కడ రీమిక్స్ చేసి వాడేశారు. సో మరి ఇది చాలదు డిఎస్పి టాలెంట్ ఏంటో చెప్పడానికి. ఒకవేళ అక్కడ ఫుల్ మూవీ సింగిల్ కార్డ్ ఛాన్సెస్ వస్తే వెళ్తాడా అన్న డౌటు ఉంది. మరి దేవి అప్పుడేమని తప్పించుకుంటాడో చూడాలి.