సాహో కథ ఇదే అంటున్నారు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ లో ఇట్స్ షో టైం అంటూ స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించాడు. కాని ఈ సినిమా మాత్త్రం టైం ట్రావెలింగ్ కథతో వస్తుందని ఎక్స్ క్లూజివ్ టాక్. ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇండిపెండన్స్ డే ముందు సీన్స్ షూట్ చేస్తున్నారట. బ్రిటీష్ జాతీయ జెండాకు.. వేలమంది సైనికులు షూటింగ్ స్పాట్ లో ఉన్నారట.

చూస్తుంటే దేశ గత చరిత్ర కథను కథగా అల్లి సాహో కథ చెప్పబోతున్నారన్నట్టు తెలుస్తుంది. బాహుబలి తర్వాత అదే రేంజ్ సినిమాతో వస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ను ఫైనల్ చేశారట. శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తాడని అంటున్నారు. మరి వస్తున్న ఈ వార్తలన్ని రూమర్స్ మాత్రమేనా లేక నిజంగానే సాహో కథ చారిత్రక కథ అన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.