అఖిల్ కోసం రంగులరాట్నం..!

విక్రం కుమార్ డైరక్షన్ లో అక్కినేని అఖిల్ రెండో సినిమా సెట్స్ మీద ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ టైటిల్ గా రంగులరాట్నం అని పెట్టబోతున్నారట. ఇప్పటికే ఈ టైటిల్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని నాగార్జున రిజిస్టర్ చేయించాడట. అఖిల్ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అఖిల్ పవర్ ఫుల్ సినిమాతో వస్తున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం చైతు కెరియర్ కాస్త సెట్ రైట్ అయినట్టే ఈ ఇయర్ రారండోయ్ వేడుక చూద్దాం హిట్ కొట్టిన చైతు యుద్ధం శరణం కూడా టీజర్ తో శభాష్ అనిపించాడు. ఇక ఎటుకూడి అఖిల్ మాత్రమే హిట్ కొట్టాల్సి ఉంది. నాగార్జున కూడా ఈ సినిమా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. హీరోయిన్ ను సెలెక్ట్ చేసినా ఇంతవరకు ఆమె ఎవరన్నది మాత్రం ఎనౌన్స్ చేయలేదు.

24 లాంటి ప్రయోగాత్మక సినిమాలతో కూడా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసిన విక్రం కుమార్ కచ్చితంగా అఖిల్ ను స్టార్ గా నిలబెట్టే సినిమా తీస్తాడని నమ్ముతున్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.