వెంకటేష్ తర్వాత సినిమా అదే..!

గురు తర్వాత వెంకటేష్ నటించే సినిమా ఏంటి అన్న దాని మీద ఇంకా ఓ క్లారిటీ రాలేదు. రోజుకి ఒకటి రెండు కథలు వింటున్నా సరే వెంకటేష్ మనసు గెలిచే కథ ఇప్పటిదాకా దొరకలేదట. అయితే వెంకటేష్ తర్వాత సినిమాపై సురేష్ బాబు మాత్రం ఓ క్లారిటీ ఇచ్చారు. వెంకటేష్ తన తర్వాత సినిమా ఓ థ్రిల్లర్ ప్రయోగం చేస్తున్నాడని ఎనౌన్స్ చేశారు. ఆ సినిమా ఓ నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తాడని అన్నారు.  

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో రాబోతున్న ఈ సినిమా గురించి త్వరలో ఓ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమానే కాకుండా తమిళంలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ అయిన విక్రం వేధ మూవీ రీమేక్ విషయంలో కూడా వెంకటేష్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తుంది. ఆ రీమేక్ లో రానా దగ్గుబాటికి అవకాశం ఉందని టాక్. మరి అదే కనుక జరిగితే దగ్గుబాటి మల్టీస్టారర్ గా ఆ సినిమాకు ఓ స్పెషల్ క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.