
ఇద్దరమ్మాయిలతో సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కేథరిన్ త్రెసా ఆ సినిమా తర్వాత అదే హీరో అల్లు అర్జున్ తో రెండు మూడు సినిమాలలో నటించి మెప్పించింది. ఇక ఆ క్రేజ్ తోనే చిరు రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150లో రత్తాలు సాంగ్ కోసం సెలెక్ట్ చేశారు. ఆ సెట్ లో ఏమైందో ఏమో కాని ఆ సినిమా నుండి ఆమెను తొలగించడం ఆమె ప్లేస్ లో రాయ్ లక్ష్మిని పెట్టుకుని సాంగ్ తీయడం అది థియేటర్లో హిట్ అవ్వడం అంతా జరిగింది.
అయితే ఆ తర్వాత రెండు మూడు సార్లు మీడియా ముందుకొచ్చినా ఈ ప్రశ్న దాటేయగా ఇప్పుడు మాత్రం ఖైది నంబర్ 150 సినిమాలో మీరు ఆ సాంగ్ ఎందుకు చేయలేదని ఆన్సర్ చెప్పేదాకా పట్టుబట్టారు మీడియా వాళ్లు. దానికి ఆమె సమాధానంగా ఆ గొడవ గురించి వాళ్లనే అడగండి తానేం చెప్పాలనుకోవట్లేదని షాక్ ఇచ్చింది. మొత్తానికి కేథరిన్ మాత్రం ఆ గొడవతో బాగానే డిస్ట్రబ్ అయినట్టు ఉంది అందుకే ఆ ప్రస్థావన తెచ్చినా సరే దాన్ని అవైడ్ చేయాలని చూస్తుంది.