రానా ఎంట్రీతో బిగ్ బాస్ లో కళ..!

ఓ పక్క తన సినిమా ప్రమోషన్ కోసం రానా బిగ్ బాస్ హౌజ్ కు రాగా మరో పక్క రానా ఎంట్రీని క్రేజ్ చేసుకునేలా బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారు. శని ఆదివారాల్లో ఎన్నో సర్ ప్రైజులు తెచ్చే తారక్ ఈసారి కూడా బిగ్ బాస్ విన్నర్ గెలుచుకునే మొత్తాన్ని ఎనౌన్స్ చేశాడు. ఇక ఆదివారం మాత్రం స్పెషల్ గెస్ట్ జోగేంద్రని బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించేశాడు.

ఇక పూల కాన్సెప్ట్ తో హౌజ్ మెట్స్ మధ్య గొడవలు పెట్టిన బిగ్ బాస్ ఈసారి రానా ముందు ఆ కొట్లాట జరిగేలా చేశాడు. రానా ఎంట్రీతో ఈ వారం ఎపిసోడ్ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యింది. ఇక ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి సమీర్, ముమైత్, కల్పనలను సస్పెన్స్ లో పెట్టి చివరగా సమీర్ ను ఎలిమినేట్ చేశారు. రానా ఎంట్రీ ఎంత జోష్ ఇచ్చిందో సమీర్ నిష్క్రమణ హౌజ్ మెట్స్ లో కాస్త విచారాకరమైన వాతావరణం తెచ్చింది.