
ఆర్య అనగానే ఫీల్ మై లవ్ అంటూ బన్ని ప్రత్యక్షమవడం ఖాయం. అంతగా యూత్ లో బలమైన ముద్ర వేసుకున్న సినిమా అది. అలాంటి ఆర్య సినిమా అవకాశాన్ని వదులుకున్నాడు నితిన్. అదేంటి ఆర్య ఆఫర్ మొదట నితిన్ కు వచ్చిందా అంటే అవుననే అంటున్నాయి సిని వర్గాలు. వినాయక్ డైరక్షన్ లో నితిన్ హీరోగా చేస్తున్న దిల్ సినిమాకు సుకుమార్ అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాడట. ఈ సినిమా టైంలోనే ఆర్య కథ రాగా హీరో నితిన్ తో డిస్కస్ చేశాడట సుకుమార్.
లైన్ మాత్రమే చెప్పడం అది కూడా కాస్త కన్ ఫ్యూజ్ గా చెప్పడంతో నితిన్ కు అంతగా నచ్చలేదట ఆర్య కథ. అయితే ఆ సినిమా తర్వాత దిల్ రాజుకి చెప్పి సినిమా ఓకే చేయించుకున్న సుకుమార్ ఆ సినిమాతో తన రేంజ్ ఏంటో చూపించాడు. ఆర్య కథ ముందు నితిన్ విన్నా ఆ సినిమా చేయకపోవడం అతని దురదృష్టమని చెప్పాలి.