
దర్శకుడిగా క్రియేటివ్ టాలెంట్ తో ప్రతిభ చాటుకుంటున్న సుకుమార్ ఆర్య నుండి నాన్నకు ప్రేమతో వరకు సత్తా చూపాడు. దర్శకుడిగా సక్సెస్ ట్రాక్ లో ఉన్న సుక్కు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో మొదటి ప్రయత్నంగా వచ్చిన కుమారి 21ఎఫ్ సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమాకు సుకుమార్ కథ అందించగా దర్శకుడు సినిమాకు సుకుమార్ కేవలం నిర్మాతగా మాత్రమే ఉన్నాడు. ఆ సినిమా ఫలితం కాస్త అటు ఇటుగా ఉన్నా మరోసారి నిర్మాతగా కుమారి కాంబినేషన్ లో సినిమా షురూ చేస్తున్నాడట.
రాజ్ తరుణ్, దేవి శ్రీ ప్రసాద్, సూర్య ప్రతాప్ ఈ ముగ్గురు కలిసి మళ్లీ సినిమా చేయబోతున్నారట. ఈ సినిమా కుమారి సీక్వల్ ఆవుతుందా లేక మరో కథా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ కు రత్నవేలు డిఓపిగా చేస్తాడని టాక్. మొత్తానికి కుమారి మళ్లీ తెర మీదకు వచ్చింది. మరి హీరోయిన్ గా హెబ్భా పటేల్ కూడా ఉంటుందో లేదో చూడాలి.