పెళ్లిచూపులు దర్శకుడితో నిఖిల్..!

పెళ్లిచూపులు అనే చిన్న సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పెళ్లిచూపులు హిట్ అవడంతో పెద్ద బ్యానర్లలో అవకాశం వచ్చినా తన టేస్టుకు తగినట్టు స్వేచ్చ ఉంటుందో ఉండదో అని చాలామందిని కాదన్నాడట. ఇక మొదటి సినిమా రిలీజ్ చేసిన సమయంలో సురేష్ ప్రొడక్షన్స్ తో కమిట్మెంట్ ఉండగా ఆ బ్యానర్లోనే తన సెకండ్ మూవీ ఉంటుందని చెబుతున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోగా వెంకటేష్ అన్నారు కాని తరుణ్ డైరక్షన్ లో నటించేది నిఖిల్ అని తెలుస్తుంది. స్వామిరారా నుండి వరుస విజయాలతో సంచలనం సృష్టిస్తున్న నిఖిల్ రీసెంట్ గా వచ్చిన కేశవతో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి సినిమాలో నటిస్తున్న నిఖిల్ తర్వాత సినిమా తరుణ్ తోనే ఫిక్స్ అయ్యాడట. మరి నిఖిల్ తరుణ్ కలయికలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.