ఆగష్టు 15న పవర్ స్టార్ గిఫ్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబందించి ఇంతవరకు టైటిల్ కూడా ఎనౌన్స్ చేయలేదు. రకరకాల టైటిల్స్ వినబడుతున్నా ఏది ఫైనల్ అన్నది తెలియలేదు. అత్తారింటికి దారేది టైపులోనే ఈ సినిమా కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తారట.

పవన్ పక్కన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అక్టోబర్ కల్లా పూర్తి చేసి సినిమాను డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో పవన్ సినిమా ఉంటుందని తెలిసిందే.