
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో మళ్లీ ఈ వారం కూడా టాప్ ప్లేస్ లో ఉందట. వారం వారం వచ్చే టి.ఆర్.పి రేటింగ్స్ లో ఈ వారం స్టార్ మా బిగ్ బాస్ షోతో మళ్లీ టాప్ 1లో ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా శని ఆదివారాల్లో తారక్ కనిపిస్తుండటంతో ఈ షో మీద అందరి దృష్టి పడింది. మిగతా వారం ఏదో అలా నడుస్తున్నా తారక్ వారంలో రెండు సార్లు బిగ్ బాస్ మీద హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
అగ్ర నటుడిగా ఉన్న ఎన్.టి.ఆర్ బుల్లితెర మీద వ్యాఖ్యాతగా అంత త్వరగా క్యారక్టర్ లో దూరడం అది కేవలం ఎన్.టి.ఆర్ వల్లే సాధ్యమని అనిపిస్తుంది. కంటెస్టంట్స్ సోమవారం నుండి శుక్రవారం దాకా షోని నీరసంగా నడిపిస్తున్నా శని ఆదివారాల్లో మాత్రం తారక్ షోని నిలబెడుతున్నాడు. ఇక వచ్చే సోమవారం నుండి బిగ్ బాస్ షోను మరో అర్ధగంట పెంచుతున్నారని తెలుస్తుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 నుండి 10.30 వరకు వచ్చే ఈ షో ఇక నుండి 11.00 దాకా వస్తుందట.