
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఖైది నెంబర్ 150 సక్సెస్ జోష్ తో మెగాస్టార్ చేయబోతున్న ఈ సినిమా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తుంది. మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హింది భాషల్లో తెరకెక్కుతుంది. పరుచూరి బ్రదర్స్ ఇప్పటికే కథను సిద్ధం చేయగా ఆగష్టు 15న ఈ సినిమా ముహుర్తం పెట్టనున్నారు.
ఇక సినిమాలో విలన్ గా ఈగ సుదీప్ నటిస్తాడని తెలుస్తుంది. కన్నడ నటుడే అయినా ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సుదీప్ చిరుని డీ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. మరి మెగాస్టార్ సినిమాకు మరింత క్రేజ్ తెస్తున్న ఈ కాంబినేషన్స్ సినిమాను ఏ రేంజ్ లో నిలబెడతాయో చూడాలి.