
జనవరిలో గౌతమిపుత్ర శాతకర్ణిగా వచ్చాడో లేదో మళ్లీ ఆరు నెలల్లోనే పైసా వసూల్ అంటూ ఫ్యాన్స్ ముందుకొస్తున్నాడు బాలయ్య బాబు. సినిమా పూర్తి కాగానే మరో సినిమా వెంట వెంటనే చేస్తున్న నందమూరి నట సింహం బాలకృష్ణను చూసి మిగతా స్టార్స్ షాక్ అవుతున్నారు. శాతకర్ణి పూర్తి కాగానే పూరితో పైసా వసూల్ చేసిన బాలయ్య అది రిలీజ్ కాకుండానే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.
కె.ఎస్.రవికుమార్ డైరక్షన్ లో సి.కళ్యాణ్ నిర్మాతగా రూపొందుతున్న సినిమా ఈరోజు రామోజి ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టారు. మొదటి షాట్ కు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కూడా త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు బాలయ్య.
ఇక పూరి పైసా వసూల్ ప్రమోషన్స్ లో భాగంగా పూరి బాలయ్యతో మళ్లీ మరో సినిమా చేస్తాడని అంటున్నారు. పైసా వసూల్ రిజల్ట్ ను బట్టి ఆ సినిమా ఉంటుందో లేదో తెలుస్తుంది. సెప్టెంబర్ 1న బాలయ్య పైసా వసూల్ రిలీజ్ అవుతుంది. శ్రీయా శరణ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు.