స్పైడర్ బూమ్ బూమ్ అదిరిపోయింది..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ నుండి మొదటి సాంగ్ భూం భూం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన భూం భూం సాంగ్ లో మహేష్ మాత్రం అల్ట్రా మోడ్రెన్ లుక్ లో అదరగొడుతున్నాడు.

హారిస్ జైరాజ్ క్లాసీ మ్యూజిక్ ఓ యాంగిల్ లో ఇదేదో జేమ్స్ బాండ్ సినిమా అన్న ఫీల్ తెస్తుంది. సినిమాలో స్పై ఏజెంట్ గా కనిపిస్తున్న మహేష్ కొత్త లుక్ మాత్రమే కాదు కొత్త జోష్ ను కనబరుస్తున్నాడు. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా 130 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్నారు.    

బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ చేస్తున్న సినిమాగా స్పైడర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 27న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ స్పైడర్ తో మహేష్ మరోసారి ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టాలని చూస్తున్నాడు.