నేతాజి సైనిక దళంలో రానా..!

టాలీవుడ్ హీరోల్లో ప్రయోగాలను చేసే దగ్గుబాటి హీరో రానా ప్రస్తుతం నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ఇది సెట్స్ మీద ఉండగానే మరో సినిమా లైన్ లో పెట్టాడు రానా. ఈసారి మళ్లీ ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడు రానా. నేతాజి కాలం నాటి కథతో సుభాష్ చంద్రబోస్ దళంలోని సైనికుడి ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతుందట. 

కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన రానా మళ్లీ కొత్త ప్రయత్నం చేస్తున్నాడట. ఈ ఇయర్ ఇప్పటికే ఘాజితో ఇండియా పాక్ సబ్ మెరైన్ యుద్ధంతో హిట్ అందుకున్న రానా ఈ సినిమాకు స్క్రిప్ట్ బలం చేకూరేలా చూస్తున్నారట. మరి నేతాజి దళంలో సైనికుడిగా రానా ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.