
సుకుమార్ నిర్మాణంలో కుమారి 21ఎఫ్ సినిమా తర్వాత వస్తున్న సినిమా దర్శకుడు. అశోక్ హీరోగా చేసిన ఈ సినిమా హరి ప్రసాద్ డైరక్షన్ లో వస్తుంది. ఆగష్టు 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసేందుకు సుకుమార్ బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా ఈవెంట్ లలో ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రాం చరణ్ లను ఇన్వాల్వ్ చేయించిన సుక్కు ఇప్పుడు మెగాస్టార్ ను కూడా తన సినిమా ప్రమోషన్ కు వాడేస్తున్నాడు.
ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన దర్శకుడు టీం ఆయన చేతే మొదటి టికెట్ కొనేలా చేశారు. సినిమా మొదటి టికెట్ కొన్న చిరు సినిమా చూసి తన అభిప్రాయాన్ని తెలపాలని కోరారు. తన అభిమానులు కలిసి తీసిన ఈ సినిమా తప్పక చూస్తానని హామీ ఇచ్చారు చిరంజీవి. మరి ప్రమోషన్స్ స్టంట్ అనిపించినా సరే సుకుమార్ చేసిన ఈ రెండో ప్రయత్నం ఎవతవకు సక్సెస్ అవుతుందో చూడాలి.