
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా బివిఎస్ రవి డైరక్షన్ లో వస్తున్న సినిమా జవాన్. దేశభక్తి కథతో రాబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. కొంతమంది మనుషులు కలిసే అది కుటుంబం.. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే అది దేశం అవుతుంది. దేశభక్తి కిరీటం కాదు కృతజ్ఞత అంటూ ఓ పవర్ ఫుల్ స్టోరీతో రాబోతున్నట్టు తెలుస్తుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి సినిమా మీద ఓ హైప్ క్రియేట్ చేసిన సాయి ధరం తేజ్ ఈసారి జవాన్ తో హిట్ కొట్టేలానే ఉన్నాడు. తిక్క, విన్నర్ ఫలితాలతో జాగ్రత్త పడుతున్న తేజ్ ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక రచయితగా ఉన్న బివిఎస్ రవి డైరక్టర్ గా తొలి ప్రయత్నం వాంటెడ్ ఫెయిల్యూర్ కాగా ఈసారి జవాన్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు బివిఎస్ రవి మరి తేజ్ తో జవాన్ రవికి హిట్ జోష్ ఇస్తుందో లేదో చూడాలి.