
దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్ రానాలు ఇద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని ఎన్నాళ్లనుండో చూస్తున్నారు. దగ్గుబాటి మనం కథ కోసం ప్రయత్నించినా కుదరలేదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఓ తమిళ సినిమాకు ఫిదా అయ్యారని తెలుస్తుంది. ఆ సినిమాను తెలుగు రీమేక్ చేసి వెంకీ, రానా నటించాలని చూస్తున్నారట.
కోలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన సినిమా విక్రం వేద. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన సినిమా విక్రం వేద సూపర్ హిట్ అందుకుంది. పుష్కర్ గాయత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. మాధవన్ గా వెంకటేష్, విజయ్ సేతుపతిగా రానా నటిస్తారట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఒకరు హీరోగా మరొకరు నెగటివ్ రోల్ గా కనిపించడమే. మరి వెంకటేష్ తో రానా చేసే ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.