
అక్కినేని నాగ చైతన్య హీరోగా నూతన దర్శకుడు కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా యుద్ధం శరణం. సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తుంది. సినిమా మీద అంచనాలు పెంచేలా వదిలిన టీజర్ అదరగొట్టేసింది. నాకు తెలిసిన ప్రపంచం ఇది కాదు అంటూ చైతు చెప్పే డైలాగ్ తో మొదలైన టీజర్ చివర్లో ఇచ్చిన విలన్ షాక్ అదుర్స్ అని చెప్పాలి.
ఈ సినిమాలో విలన్ ఎవరో కాదు హీరో శ్రీకాంత్. హీరోగా కెరియర్ ముగిసిన శ్రీకాంత్ ఈసారి విలన్ గా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఈ ఇయర్ ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో హిట్ అందుకున్న చైతు యుద్ధం శరణంతో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు.