'ఉన్నది ఒక్కటే జిందగి'.. ట్రెండింగ్ లో ఉన్న రామ్ కొత్త టైటిల్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నేను శైలజ దర్శకుడు కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ గా ఉన్నది ఒక్కటే జిందగి అని ఫిక్స్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న వెరైటీ టైటిల్ ట్రెండ్ ను కొనసాగిస్తూ రామ్ కూడా ఓ ఎనర్జిటిక్ టైటిల్ పెట్టేశాడు. కొద్దికాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కు నేను శైలజతో హిట్ ఇచ్చిన కిశోర్ తిరుమల మరోసారి రామ్ కోసం హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.     

సినిమా టైటిల్ లానే రామ్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటాడని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ లు నటిస్తుండటం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. నేను శైలజ సినిమాకు దేవి మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే ఆ మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారు. మరి రామ్ ఉన్నది ఒక్కటే జిందగి సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.           

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమా తర్వాత రామ్ మరోసారి కరుణాకరణ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇదవరకే కరుణాకరన్ తో ఎందుకంటే ప్రేమంట సినిమా చేశాడు రామ్.. అయితే ఆ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది.