ఫిదా భామ గురించి సమంత..!

లాస్ట్ వీక్ రిలీజ్ అయిన వరుణ్ తేజ్ ఫిదా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా దిల్ రాజు నిర్మించగా మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. సినిమాలో ప్రత్యేకంగా భానుమతి పాత్ర చేసిన సాయి పల్లవి అందరి ప్రశంసలను అందుకుంది. సినిమా చూసిన సిని రాజకీయ ప్రముఖులు చిత్రయూనిట్ ను ప్రశంసిస్తున్నారు.  

ఇక ఆ మార్గంలో సమంత కూడా ఫిదా రెఫ్రెషింగ్ గా ఉంది. స్వచ్చమైన ప్రేమని అందించిన శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ లకు చిత్రయూనిట్ అందరికి కంగ్రాట్స్ అని ట్వీట్ చేసింది. అంతేకాదు భానుమతిగా చేసిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా ఈమె నటించిన ఏ సినిమా అయినా చూసేయొచ్చు అని అభిమానులకు చెప్పింది. సాయి పల్లవి సమంత మనసుని గెలుచుకుందన్నమాట. ఇక సమంత పెట్టిన ట్వీట్ కు తన రెస్పాన్స్ అందించింది సాయి పల్లవి. ఆమె అన్న మాటలను చాలా గౌరవంగా భావిస్తున్నా థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చింది.