ఎన్టీఆర్ నీ ఎనర్జీ సూపర్ అంతే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రియాలిటె షో బిగ్ బాస్. స్టార్ మాను టి.ఆర్.పిలో నెంబర్ 1గా నిలిచేలా చేసిన బిగ్ బాస్ లో ఎన్.టి.ఆర్ ఎనర్జీ గురించి అందరు మాట్లాడుతున్నారు. వారం మొత్తం ఎలా ఉన్నా సరే శని ఆదివారాల్లో తారక్ చేసే ఆ మ్యాజిక్ అందరిని ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఈ షో తారక్ ఎనర్జీ గురించి కింగ్ నాగార్జున కామెంట్ చేశారు.


బిగ్ బాస్ ఎన్.టి.ఆర్ నీ ఎనర్జీ సూపర్. స్టార్ మా టి.ఆర్.పి రేటింగ్ అదరగొట్టావ్ అని ట్వీట్ చేశారు నాగ్. ఇక దాని రిప్లై ఇస్తూ థాంక్యూ బాబాయ్ మీరు చూపించిన మర్గంలోనే నేను నడుస్తున్నా అని ట్వీట్ చేశారు. నాగ్ ప్రశంస అంతలోనే ఎన్.టి.ఆర్ విధేయత అబ్బో ఈ ట్వీట్ చిట్ చాట్ ఫ్యాన్స్ కు భలే ఉత్సాహాన్నిచ్చింది. బుల్లితెర మీద ఎన్.టి.ఆర్ మొదటిసారి చేస్తున్న బిగ్ బాస్ స్టార్ మా ను మొదటిసారి టి.ఆర్.పిలో నెంబర్ 1గా నిలబడేలా చేసింది.