
మలయాళ ప్రేమతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి ఆ సినిమాతో సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇక ఆ సినిమా ఇమేజ్ తో శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఫిదా అంటూ ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది అమ్మడు. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సక్సెస్ లో ప్రధాన కారణం అయిన సాయి పల్లవి తనకు రెమ్యునరేషన్ కోటి ఇచ్చినా సరే నచ్చని పాత్రని మాత్రం చేయనని అంటుంది.
ప్రేమం తర్వాత మలయాళంలో చాలా అవకాశాలే వచ్చినా కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన సాయి పల్లవి తెలుగులో ఫిదా తర్వాత కూడా కోటి రెమ్యునరేషన్ ఇస్తామని వస్తున్నారని కాని తనకు ప్రాధాన్యత లేని కథలు తను అసలు ఒప్పుకోనని అంటుంది. కేవలం డబ్బు కోసమే సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచేసే భామలున్న ఈరోజుల్లో కోటి ఇచ్చినా సాయి పల్లవి సినిమా ఛాన్స్ వదులుకుంది అంటే అమ్మడి ఆలోచన తీరు వేరే అని చెప్పొచ్చు.