ఆ ఫ్లాప్ సినిమా రీమేక్ లో ధనుష్..!

కోలీవుడ్ సూపర్ హీరో ధనుష్ అక్కడ మాత్రమే కాదు తెలుగు హింది భాషల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో రఘువరన్ బిటెక్ తో క్రేజ్ తెచ్చుకోగా.. హిందిలో అమితాబ్ తో షమితాబ్ సినిమాలో నటించి అక్కడ ప్రేక్షకులను మెప్పించాడు. అందుకే ప్రస్తుతం విఐపి-2 ను హిందిలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిన ధనుష్ తనకు బాలీవుడ్ లో 2012లో వచ్చిన బర్ఫీ సినిమా ఇష్టమని కుదిరితే అది తమిళంలో రీమేక్ చేస్తా అన్నాడు.  

రణబీర్ కపూర్, ఇలియానా జంటగా నటించిన ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు. మరి ఆ ఫ్లాప్ సినిమాను ధనుష్ ఎందుకు రీమేక్ చేయాలనుకుంటున్నాడో అర్ధం కావట్లేదు. ప్రయోగాలు చేయడంలో ధనుష్ ఎప్పుడు ముందుంటాడు అందుకే బర్ఫీ సినిమా రీమేక్ ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నాడు. ఆ సినిమాలో తానే హీరోగా నటించడమే కాకుండా అది తన నిర్మాణంలోనే తెరకెక్కించాలని చూస్తున్నాడు. అక్కడ ఫ్లాప్ అయిన బర్ఫీ తమిళంలో ఎలా ఉంటుందో చూడాలి.