
టాలీవుడ్ స్టార్ హీరోగా నందమూరి బాలకృష్ణ హీరోగా 100 సినిమాలను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 101వ సినిమా పూరి డైరక్షన్ లో పైసా వసూల్ సినిమా చేస్తున్న బాలయ్య త్వరలో నిర్మాతగా మారబోతున్నారని ఎక్స్ క్లూజివ్ టాక్. తన స్నేహితులతో కలిసి బాలయ్య ఓ ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేస్తున్నారట. ఇక ఆ నిర్మాణ సంస్థ నుండి మొదట తన వారసుడు మోక్షజ్ఞ సినిమా వస్తుందని అంటున్నారు.
100 సినిమాల అనుభవంలో బాలయ్యకు ఏ కథ ఎలా క్లిక్ అవుతుందో అంచనా వేసే సత్తా ఉంది. ఇప్పటికే నాగార్జున డైరెక్ట్ గా నిర్మాణ సంస్థను నడిపిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో పైకి చరణ్ నిర్మాతగా ఉన్నా ఆ నిర్మాణ సంస్థలో చిరు డెశిషన్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక వెంకటేష్ ఒక్కడే నిర్మాతగా మారలేదు. మరి నిర్మాతగా బాలయ్య ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.