సిట్ విచారణకు రవితేజ.. ఇంటి నుండి మాత్రం కాదట..!

డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా సిట్ అధికారుల ముందుకు ఈరోజు ముమైత్ ఖాన్ అటెండ్ అవగా రేపు రవితేజ సిట్ ముందు ప్రత్యక్షమవనున్నాడట. ప్రస్తుతం అవుట్ డోర్ షూట్ జరుపుకుంటున్న రవితేజ రేపు సిట్ అధికారుల ముందు హాజరయ్యేందుకు ఇంటి నుండి కాకుండా బయట నుండి వస్తాడని టాక్. 

ఇంటి నుండి అయితే మీడియా ఫాలోయింగ్ లేని పోని కథనాలు ఎక్కువవుతాయని రేపు ఉదయాన్నే రవితేజ బయటకు వచ్చేసి అటు నుండి అటే సిట్ ఆఫీస్ కు వస్తాడని అంటున్నారు. పూరితో సన్నిహితంగా ఉన్నందుకే సిట్ నోటీసులు పంపించిందా లేక రవితేజకు నిజంగానే డ్రగ్స్ తో సంబంధం ఉందా అన్నది రేపు విచారణలో తెలుస్తుంది. ఇప్పటికే తన కొడుకుకి ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి.