టాక్ ఎలా ఉన్నా టి.ఆర్.పి అదిరిపోయింది.. బుల్లితెరపై ఎన్టీఆర్ దమ్ము ఇది..!

ఎన్.టి.ఆర్ బుల్లితెర మీద మొదటిసారి హోస్ట్ గా చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. అసలు ఏమాత్రం తెలుగు వారికి పరిచయం లేని ఈ షోతో బుల్లితెర ఆడియెన్స్ ను ఎటర్టైన్ చేస్తున్నాడు తారక్. తను కనిపించిన శని ఆదివారాలు టి.ఆర్.పి రేటింగ్ టాప్ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈరోజు వెళ్లడైనా టి.ఆర్.పి రేటింగ్స్ లో అత్యధికంగా 16.18 పాయింట్స్ తో బిగ్ బాస్ నెంబర్ 1 గా నిలవడం విశేషం.

ఎన్.టి.ఆర్ దమ్ముని మరోసారి బుల్లితెర మీద కూడా చూపించాడని చెప్పొచ్చు. 14 మంది కంటెస్టంట్స్ తో మొదలైన ఈ షో నుండి జ్యోతి ఎలిమినేట్ అవగా సంపూర్నేష్, ముమైత్ ఖాన్ లు అనివార్య కారణాల వల్ల షో నుండి బయటకు వచ్చారు. ముమైత్ మాత్రం డ్రగ్స్ కేసులో సిట్ ముందు హాజరయ్యేందుకు మాత్రమే ఒక్క రోజు బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిందట. ఇక షో నీరసంగా సాగుతున్నా తారక్ తన మెస్మరైజింగ్ నటనతో బిగ్ బాస్ కు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడు.