మెగాస్టార్ టైటిల్ వాడేస్తున్న మేనళ్లుడు..!

మెగా మేనళ్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరం తేజ్ హిట్ట్లు ఫ్లాపుల రేషియో ఎలా ఉన్నా సరే మెగా అభిమానుల మనాసులను మాత్రం గెలిచేశాడు. తిక్క, విన్నర్ షాకుల తర్వాత జవాన్ గా త్వరలో రాబోతున్నాడు సాయి ధరం తేజ్. ఇక ఇదే కాకుండా వినాయక్, కరుణాకరణ్ డైరక్షన్స్ లో సినిమా చేస్తున్నాడని తెలిసింది. అంతేకాదు మారుతి నిర్మాణంలో కూడ సాయి ధరం తేజ్ ఓ సినిమా ఉండబోతుందట. 

ఈ సినిమా దర్శకుడు ఎవరో తెలియదు కాని ఈ సినిమాకు టైటిల్  గా మహానగరంలో మాయాగాడు అని పెట్టబోతున్నాడట. ఇదే టైటిల్ తో ఆల్రెడీ మెగాస్టార్ సినిమా వచ్చింది. నిన్న మొన్నటిదాకా మెగాస్టార్ సాంగ్స్ రీమేక్ చేసి మెగా ఫ్యాన్స్ ను మెప్పించిన తేజ్ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ టైటిల్ నే వాడేస్తుండటం విశేషం. కామెడీ జానర్ లో నడిచే ఈ సినిమా గురించి త్వరలో మిగతా డీటేల్స్ వెళ్లడవుతాయని తెలుస్తుంది.