
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా తెరకెక్కుతుంది. సినిమాలో బన్ని ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో తన లుక్ కోసం ఏకంగా అమెరికాలోని నిపుణలతో ట్రైనింగ్ తీసుకోవాలని చూస్తున్నాడు బన్ని. ఆర్మీ లుక్.. నడవడిక అంతా అక్కడే నేర్చేసుకుంటాడట.
రీసెంట్ గా నటించిన దువ్వాడ జగన్నాధం పర్వాలేదు అనిపించినా ఆ సినిమా మీద మెగా అభిమానులు చేసిన హడావిడికి కాస్త డిస్ట్రబ్ అయ్యాడని తెలుస్తుంది. కాస్త టైం తీసుకుని ఆ విషయం మీద మళ్లీ ఎటాక్ చేయాలని చూస్తున్నాడట. అందుకే ఇలా ట్రైనింగ్ మేకోవర్ అని చెప్పి అమెరికా చెక్కేస్తున్నాడు బన్ని. మొత్తానికి సినిమా కోసం కష్టపడుతున్న బన్నికి వంశీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో చూడాలి.