
నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాధ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పైసా వసూల్. సెప్టెంబర్ 29న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ టీజర్ కు కొత్తగా టీజర్ కా బాప్ ట్రైలర్ గా బేటా స్టంపర్ అంటూ ఓ కొత్త నామకరణం చేశారు. ఈ స్టంపర్ 228న బ్లాస్ట్ అవనుందట.
నందమూరి బాలకృష్ణను తన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో కచ్చితంగా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ పైసా వసూల్ ఉండబోతుందని తెలుస్తుంది. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీయ హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పాటలు కూడా అదిరిపోయాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆడియోని ఆగష్టు 16న ఖమ్మం లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.